స్మితా సబర్వాల్ పై జడ్సన్ ఫిర్యాదు
జాతీయ మానవ హక్కుల కమిషన్ కు
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తను స్వతహాగా దివ్యాంగుడు కావడంతో వికలాంగులు సివిల్స్ పరీక్షలకు ఎలా అర్హులు అవుతారంటూ ప్రశ్నించడాన్ని తప్పు పట్టారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. తను మహిళ అయి ఉండి పోయింది కానీ లేక పోయి ఉంటే దాడికి గురి అయి ఉండేదని మండిపడ్డారు. భారత రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులను పనిగట్టుకుని వ్యక్తిగతంగా దూషించడం చట్ట రీత్యా నేరమని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నంత మాత్రాన ఇతరులను చులకన చేయాలని ఎక్కడా రూల్ లేదన్నారు.
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తన స్థాయికి దిగజారి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్సన్. దేశంలోని కోట్లాది మంది దివ్యాంగుల మనో భావాలను, భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను భంగ పరిచే విధంగా ప్రవర్తించారంటూ స్మితా సబర్వాల్ పై బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి స్మిత సబర్వాల్ మిగతా క్యాడర్ అధికారులకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.