తగ్గేదే లేదంటున్న స్మితా సబర్వాల్
పరీక్ష రాసేందుకు సిద్దమే..ఏజ్ సరిపోదు
హైదరాబాద్ – తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సీరియస్ గా స్పందించారు. ఆమె ఇప్పిటకీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ స్పష్టం చేశారు. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తన పట్ల కామెంట్స్ చేసిన మాజీ ఐఏఎస్, కోచింగ్ నిర్వహిస్తున్న బాల లత మల్లవరపు పై సెటైర్ వేశారు. తనతో పాటు సివిల్స్ పరీక్ష రాయాలంటూ ఆమె చేసిన సవాల్ ను తాను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఇందుకు ఇద్దరి వయస్సులు ఇప్పుడు సరి పోవని , ఆ మాత్రం తెలియకుండా మాట్లాడితే ఎలా అంటూ ఎద్దేవా చేశారు స్మితా సబర్వాల్.
విచిత్రం ఏమిటంటే తనను అనుమతించే ఛాన్స్ ఉందేమో కానీ తనకు ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. తాను నిత్య విద్యార్థినని, ప్రజల కోసం పని చేస్తూ వచ్చానే తప్పా ఏనాడూ అధికారం ఉంది కదా అని ఎంజాయ్ చేయలేదని స్పష్టం చేశారు స్మితా సబర్వాల్.
వికలాంగుల కోటాలో బాల లత తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగించారంటూ ప్రశ్నించారు. కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లను నడిపించేందుకా లేక ప్రజలకు సేవ చేసేందుకా అని నిలదీసింది.