విద్యా నైపుణ్యాభివృద్దికి పెద్దపీట
వ్యవసాయానికి రూ. 1.52 లక్షల కోట్లు
న్యూఢిల్లీ – పార్లమెంట్ లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర సర్కార్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. వరుసగా ఏడో సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వార్షిక బడ్జెట్ లో విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించామన్నారు.
వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందించామని, 400 జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. మూడు స్కీంల ద్వారా ఉద్యోగ కల్పన ఉంటుందన్నారు… కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్వో పథకం తీసుకు వస్తున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి.
మహిళలు, యువత కోసం వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాట చేస్తామన్నారు.. 20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమంతో పాటు మహిళలనైపుణ్య అభివృద్ధికి ప్రత్యేకంగా ఫోకస్ పెడతామన్నారు నిర్మలా సీతారామన్.