అమరావతి అభివృద్దికి రూ. 15 వేల కోట్లు
కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన నిర్మలా
న్యూఢిల్లీ – పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ 2024ను ప్రవేశ పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్బంగా మోడీ ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాజధాని అమరావతి అభివృద్ది చేసేందుకు రూ. 15 వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. ఇది ప్రత్యేకంగా సాయం చేస్తున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా విభజన హామీ చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు భరోసా ఇచ్చింది బడ్జెట్. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్.
ఏపీ రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయం చేస్తామన్నారు.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మంజూరు చేస్తామన్నారు… అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు… రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామన్నారు… వాటర్, పవర్, రైల్వే, రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.