గృహ నిర్మాణానికి రూ. 10 లక్షల కోట్లు
బడ్జెట్ 2024లో కేంద్ర సర్కార్ ప్రయారిటీ
న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో గృహ నిర్మాణానికి పెద్ద పీట వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున నిధులు కేటాయించింది. ఏకంగా రూ. 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
అంతే కాకుండా 100 పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలు చేస్తామన్నారు. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు నిర్మలా సీతారామన్.
అంతే కాకుండా అణు విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.. కొత్త రియాక్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు ఆర్థిక మంత్రి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు ఇస్తామన్నారు.
ఇక ప్రధాన రంగమైన వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.. వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు. 400 జిల్లాల్లో అమలు చేస్తామన్నారు.