NEWSNATIONAL

కేంద్ర బ‌డ్జెట్ అంచ‌నా రూ. 32.07 ల‌క్ష‌ల కోట్లు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తున్న ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్ లో 2024-25 సంవ‌త్స‌రానికి సంబంధించి వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. విద్య‌, వ్య‌వ‌సాయం, సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేశారు.

మొత్తం బ‌డ్జెట్ కు సంబంధించి అంచ‌నాలు రూ. 32.07 ల‌క్ష‌ల కోట్లుగా అంచ‌నా వేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధానంగా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద పీట వేశామ‌న్నారు. ఇందు కోసం రూ. 11.11 ల‌క్ష‌ల కోట్లు కేటాయించిన‌ట్లు చెప్పారు.

గ్రామీణాభివృద్ధికి సంబంధించి రూ.2.66 లక్షల కోట్లు.. అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు ప్ర్థకేటాయించిన‌ట్లు పేర్కొన్నారు. ఆర్థిక లోటు 4.9 శాతంగా ఉంద‌న్నారు. ఆరోగ్య ప‌రంగా క్యాన్సర్ వైద్యానికి సంబంధించి ఉప‌యోగించే మూడు మందుల‌కు క‌స్ట‌మ్ డ్యూటీ మిన‌హాయించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

మేడిన్ ఇండియా మెడికల్ పరికరాలపై ఫోకస్ పెడ‌తామ‌న్నారు. మొబైల్స్ , మొబైల్‌ యాక్ససరీస్‌పై 15 శాతం డ్యూటీ తగ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు విత్త మంత్రి. 20 రకాల ఖనిజాలపై కస్టమ్‌ డ్యూటీతో పాటు బంగారం, వెండిపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్న‌ట్లు చెప్పారు నిర్మ‌లా సీతారామ‌న్.