ఏపీకి అందలం తెలంగాణకు మంగళం
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి
హైదరాబాద్ – పార్లమెంట్ లో కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ వార్షిక బడ్జెట్ 2024-25ను ప్రవేశ పెట్టింది. ఏపీకి భారీ ఎత్తున తాయిలాలు ప్రకటించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 15,000 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అంతే కాకుండా పారిశ్రామిక కారిడార్లను కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో మరో స్టేట్ బీహార్ కు ఏకంగా రూ. 25,000 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్కటి ప్రకటించక పోవడం దారుణం. ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఉండగా మరో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి చెందిన వారున్నారు. కానీ ఏ ఒక్కరు నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు.
ఏపీకి 15 వేల కోట్లతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్దికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, వైజాగ్ – చెన్నై ఇండిస్ట్రియల్ కారిడార్ ను ప్రకటించడం దారుణం. 12 ఎంపీలతో మద్దతు ఇచ్చినందుకు బీహార్ కు రూ. 25 వేల కోట్లతో పాటు 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన ఎయిర్ పోర్టులు, నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సాయం చేస్తామని ప్రకటించారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్.