తెలంగాణ బీఏసీ కీలక నిర్ణయం
జూలై 31 దాకా అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన మంగళవారం సచివాలయ చాంబర్ లో కీలక సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు ఇతర మంత్రులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జూలై 23న శాసన సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 31వ తేదీ వరకు శాసన సభకు సంబంధించిన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఆమోద ముద్ర తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ మీటింగ్స్ జరుగుతాయని, ఆయా నియోజకవర్గాలకు చెందిన సభ్యులు పూర్తి సమాచారంతో రావాలని సూచించారు. సభా సమయం తక్కువగా ఉండడంతో కీలకమైన అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తే మంచిదని పేర్కొన్నారు. బీఏసీ భేటీలో మరికొన్ని కీలక అంశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు స్పీకర్.
సాధ్యమైనంత మేరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు కొంత సంయమనం పాటించాలని, మంత్రులు సమాధానం చెప్పేంత వరకు ఓపిక పట్టాలని స్పష్టం చేశారు స్పీకర్.