ఢిల్లీకి చేరుకున్న జగన్..రేపే ధర్నా
ఆయనతో పాటే ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. జగన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఢిల్లీలో ఎంపీలు స్వాగతం పలికారు.
నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు.
ఇదే సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. అనంతరం సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు . రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని, ప్రధానంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.
ఇప్పటికే తమకు అపాయింట్ మెంట్ కావాలని పీఎం మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కోరవడం జరిగిందని చెప్పారు. జూలై 24న బుధవారం న్యూఢిల్లీలో వైసీపీ ధర్నా చేపట్టనుందని , అందుకే ఢిల్లీకి వచ్చానని స్పష్టం చేశారు మాజీ సీఎం.