NEWSTELANGANA

కేంద్రం ప‌క్ష‌పాతం సీఎం ఆగ్ర‌హం

Share it with your family & friends

తెలంగాణ ప‌ట్ల ఇంత వివ‌క్ష త‌గ‌దు

హైద‌రాబాద్ – కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్ లో తెలంగాణ గురించి ప్ర‌స్తావించ‌క పోవ‌డం, ఒక్క పైసా కేటాయించ‌క పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని ఆరోపించారు.

తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు. కక్ష పూరితంగా వ్యవహరించారు. బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షపై అసెంబ్లీలో చర్చ చేపట్టి ప్రభుత్వ నిరసనను కేంద్రానికి తెలియజేస్తామని చెప్పారు.

వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని కేంద్రం భావిస్తున్నట్టు తాజా వైఖరిని బట్టి స్పష్టమవుతోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా మూడుసార్లు ప్రధానమంత్రిని కలిసి కోరామ‌న్నారు. వివక్ష లేని, వివాదాలు లేని, కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కలిగి అభివృద్ధికి సహకరించాలని కోరామ‌ని తెలిపారు. కానీ బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారంటూ
ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.