మండలిలో ప్రతిపక్ష నేతగా సిరికొండ
ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. శాసన మండలిలో భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) తరపున ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన ప్రకటన చేశారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి దాకా తనకు చేదోడుగా ఉన్నారంటూ చారిని ప్రశంసించారు. పార్టీ కోసం పనిచేయాలని, సమస్యలపై నిల దీయాలని సూచించారు.
భూపాలపల్లి నియోజకవర్గానికి ఇంఛార్జిగా గండ్ర వెంకట రమణా రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు కేసీఆర్. సిరికొండ , గండ్ర కలిసికట్టుగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇక తాను కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు.
తాను కూడా శాసన సభకు వస్తానని, ఏం చేస్తారో చూస్తానంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రయత్నం చేయాలన్నారు. పూర్తి సమాచారంతో ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలని, సీఎంను, మంత్రులను కడిగి పారేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.