NEWSANDHRA PRADESH

ఏపీపై నిర్మలా కీల‌క కామెంట్స్

Share it with your family & friends

ఏపీకి ఇచ్చే రూ. 15000 కోట్లు అప్పే

న్యూఢిల్లీ – కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ. 15000 కోట్లు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల వ‌స్తున్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు.

కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. తాము గ్రాంట్ గా ఇవ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇది ప్ర‌పంచ బ్యాంకు ద్వారా ఏపీకి ఇప్పిస్తున్నామ‌ని, అయితే కేంద్ర స‌ర్కార్ గ్యారెంటీగా మాత్ర‌మే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు నిర్మ‌లా సీతారామన్.

అయితే ఇందులో ఏపీ ప్ర‌భుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఉంటుంద‌న్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. ఇది ఏపీ ఇస్తుందా లేక‌పోతే కేంద్రం గ్రాంట్ గా ఇవ్వాలా అనేది తేల్చుకుంటామ‌ని చెప్పారు ఆర్థిక మంత్రి.

విదేశీ బ్యాంకుల ద్వారా తెచ్చుకునే రుణాలకు కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు 20 శాతం లేదా 30 శాతం మ్యాచింగ్ గ్రాంట్ గా కేటాయించాల్సిందేన‌ని చెప్పారు నిర్మ‌లా సీతారామ‌న్. మంజూరు చేసిన రుణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు.