రేవంత్ రన్నింగ్ కామెంటరీ వద్దు
మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర శాసన సభలో మాటల యుద్దం కొనసాగింది. ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి తెర లేపారు. ఓ వైపు హరీశ్ రావు మరో వైపు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పదపదే రన్నింగ్ కామెంటరీ చెబుతూ వస్తున్నారని, ఆయన దానికే పనికి వచ్చేలా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇది మంచి పద్దతి కాదన్నారు. కొంచెం స్థాయికి తగ్గట్టు మాట్లాడితే ఆ సీఎం పదవికి అర్థం ఉంటుందన్నారు. ఎలా పడితే అలా , నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదన్నారు. ఇది ఎంత మాత్రం సంస్కారం అనిపించు కోదని పేర్కొన్నారు కేటీఆర్.
తాము కూడా తీవ్ర ఆరోపణలు చేయొచ్చని, పదే పదే ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం మానుకుంటే బెటర్ అన్నారు. పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని నేను కూడా అనొచ్చు అని అన్నారు.
రేవంత్ రెడ్డి అయ్యల పేర్లు చెప్పి పదవులు అనుభవిస్తున్నారు అని అంటున్నాడు అంటే రాహుల్ గాంధీని అంటున్నడా? రాజీవ్ గాంధీని అంటున్నడా అనేది అర్థం కావడం లేదన్నారు.