NEWSTELANGANA

అర్హులంద‌రికీ విద్యుత్ బిల్లుల వ‌ర్తింపు

Share it with your family & friends

ద‌ర‌ఖాస్తు చేసుకోక పోతే వెసులుబాటు

హైద‌రాబాద్ – విద్యుత్ బిల్లులకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. బుధ‌వారం శాస‌న స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయ‌న స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

200 యూనిట్లలోపు ఎవరు వాడుకున్నా వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. వీటిని వాడుకుంటున్న వారికి సంబంధించి ప్ర‌భుత్వ ప‌రంగా ఎంపిక చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.

గ్రామసభలు పెట్టి, ఆ గ్రామసభల్లో రేషన్ కార్డు జతచేసి ప్రజలందరినీ దరఖాస్తు చేసుకొవాలని చెప్పడం జరిగిందన్నారు. అలా వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారందరికీ 200 యూనిట్ల జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామ‌ని చెప్పారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

ఒక‌వేళ‌ అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోక పోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్న వారు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. దీనికి ఎలాంటి డెడ్ లైన్ లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇది నిరంత‌రం కొన‌సాగే కార్య‌క్ర‌మ‌మ‌ని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.