ధర్నా సక్సెస్ జగన్ ఖుష్
పలు పార్టీల మద్దతుతో సక్సెస్
న్యూఢిల్లీ – ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు మరో వైపు ఏపీ అసెంబ్లీని తన వైపు తిప్పుకునేలా ..చర్చకు కొనసాగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. బుధవారం తన సారథ్యంలో ఏపీలో చోటు చేసుకున్న దారుణాలు, హత్యలు, దాడులను నిరసిస్తూ ధర్నాకు దిగారు రాజధాని ఢిల్లీలో.
ఈ సందర్బంగా ఫోటో ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్ రెడ్డి. ఆయనకు మద్దతుగా దేశంలోని పలు పార్టీలకు చెందిన నేతలు, ఎంపీలు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ధర్నా కార్యక్రమానికి ఎఐఎడిఎంకె, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యుబిటి), ఎఐఎంఎల్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆప్, విసికె, తదితర పార్టీల నాయకులు హాజరయ్యారు. తాము చేపట్టిన ధర్నా సక్సెస్ కావడంతో ఆందోళన విరమించారు వైసీపీ. ఈ సందర్బంగా తమ పోరాటానికి బేషరతుగా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు జగన్ మోహన్ రెడ్డి.