DEVOTIONAL

ఎస్ఎస్డీ టోకెన్ కౌంట‌ర్ల త‌నిఖీ

Share it with your family & friends

ప‌లు సూచ‌న‌లు చేసిన జేఈఓ

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఈఓగా జె. శ్యామ‌ల రావు బాధ్య‌త‌లు చేప‌ట్టాక కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప‌రిపాల‌నా ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జేఈఓలు గౌత‌మి, వీర బ్ర‌హ్మం దూకుడు పెంచారు. త‌నిఖీలు, స‌మావేశాల‌తో హోరెత్తిస్తున్నారు.

తాజాగా తిరుప‌తిలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కేటాయిస్తున్న టైం స్లాటేడ్ సర్వ దర్శనం (ఎస్ఎస్ డి) టోకెన్ల కౌంటర్లను జేఈఓ గౌత‌మి (విద్యా, ఆరోగ్యం) తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జేఈవో శ్రీనివాసంలోని ఎస్ఎస్ డి టోకెన్ల జారీ కౌంటర్లు, క్యూ లైన్ లను పరిశీలించారు. అనంతరం విష్ణు నివాసంలోని గదుల కేటాయింపు, ఎస్ఎస్ డి టోకెన్ల కౌంటర్లను, క్యూ లైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

జేఈఓ వెంట టీటీడీ సిఈ నాగేశ్వరరావు, రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, విజిఓ బాలి రెడ్డి, ఈఈ కృష్ణారెడ్డి, డిప్యూటీ ఈవోలు పార్వతి, భారతి తదితరులు ఉన్నారు.