ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
ప్రకటించనున్న కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సందర్బంగా చాలా మంది సీనియర్ నాయకులకు టికెట్ ఇవ్వలేక పోయింది. దీంతో ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చింది పార్టీ హైకమాండ్.
కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి నెల రోజులు పూర్తయింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18న తుది గడువు విధించింది. ఇదే సమయంలో ఈనెల 29న తుది ఫలితాలు వెలువరించనున్నట్లు ప్రకటించింది ఈసీ.
దీంతో ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనకు వెళ్లారు. ఇక ఎవరికి ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది పార్టీ. ఇవాళ మకర సంక్రాంతి కావడంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది.
తాజా పార్టీ పరిశీలనలో మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, పటేల్ రమేష్ రెడ్డి, ఏరావత్ అనిల్ పేర్లు వినిపిస్తున్నాయి.