వరద భీభత్సం సర్కార్ నిర్లక్ష్యం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఓ వైపు భారీ వర్షాల తాకిడికి పెద్ద ఎత్తున పంటలు నీటి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు రైతులు, సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించు కోవాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
వైఎస్ షర్మిలా రెడ్డి తాడేపల్లి గూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వర్షాల కారణంగా దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు. పంటలు కోల్పోయిన రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా బాధితులను పరామర్శించాల్సిన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్డడం దారుణమన్నారు. ఇదేనా మీ బాధ్యత అంటూ మండిపడ్డారు.
నిన్నటి దాకా నీతులు వల్లిస్తూ వచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి. రైతులను పరామర్శించేందుకు సమయం లేదా అని నిలదీశారు. ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు.
ప్రతిపక్ష పార్టీగా తాము ప్రజల పక్షాన నిలబడతామని, అవసరమైతే ఆందోళన చేపట్టేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని హెచ్చరించారు ఏపీ పీసీసీ చీఫ్.