రేవంత్ నిరాహారదీక్షకు రెఢీనా
పిలుపునిచ్చిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాటల యుద్దం కొనసాగుంది. నువ్వా నేనా అన్న రీతిలో విమర్శలకు తెర తీశారు కేటీఆర్, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్ వివక్ష చూపడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా మోడీ ప్రభుత్వం కావాలని నాలుగున్నర కోట్ల ప్రజానీకం ఆత్మ గౌరవం భంగం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ లో తెలంగాణ పేరే ఊసెత్తక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కేటీఆర్. దీనిపై ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మంజూరు చేయాల్సిన పనులపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని కోరారు. ఇందు కోసం అవసరమైతే తాము కూడా మద్దతు ఇస్తామని ప్రకటించారు కేటీఆర్.