లిక్కర్ పాలసీపై విచారణకు ఆదేశం
నిప్పులు చెరిగిన చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. శాసన సభలో ప్రసంగించిన సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాపం పండిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని మండిపడ్డారు.
దోచు కోవడం, దాచు కోవడం పైనే ఫోకస్ పెట్టాడని, అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారంటూ ఎద్దేవా చేశారు. తను చేసిన అతి పెద్ద స్కామ్ బయటకు రావడం ఖాయమన్నారు. పాపం పండాక జైలుకు వెళ్లడం తప్పదని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు.
లక్ష కోట్లు క్యాష్ చెల్లింపులు చేశాడని, డిస్టలీరలను లాగేసుకున్నాడని మండిపడ్డారు సీఎం. నాణ్యత లేని మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకున్నాడని ఫైర్ అయ్యారు. అడ్రస్ లేని బ్రాండ్లతో తన ఖజానాను నింపుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.
వచ్చిన నాలుగు నెలలకే 422 జీవో తెచ్చి రక్తం తాగాడు. మరో 8 నెలలకు జీఓ 128 తెచ్చి డబుల్ చేసి డబుల్ బ్లడ్ తాగాడు. మళ్లీ మరుసటి రోజే మరో జీవో 129 తెచ్చి డబుల్ కు డబుల్ చేసి నాలుగు రెట్ల రక్తం తాగాడు, జగన్. నల్లి నుండి జలగలా, జలగ నుండి రక్త పిశాచి లా మారి, చివరికి రక్త పిశాచి కూడా జడుసుకొనేలా.. మద్యం సేవించే ప్రజల శరీర అవయవాలు పాడవుతున్నా.. కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ. 18 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దీని ద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు సీఎం.