NEWSINTERNATIONAL

ప్ర‌జాస్వామ్యం లేక‌పోతే ప్ర‌మాదం

Share it with your family & friends

హెచ్చ‌రించిన జోసెఫ్ బైడెన్

అమెరికా – ప్రజాస్వామ్యం లేక పోతే దేశానికి ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు అమెరికా దేశాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్. దేశాన్ని ఉద్దేశించి ఆయ‌న వీడ్కోలు ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్బంగా డెమోక్ర‌సీ ప్రాధాన్య‌త‌ను చెప్ప‌క‌నే చెప్పారు. కావాల‌ని మీరంతా కోరుకుంటే తాను మ‌రో నాలుగు ఏళ్ల పాటు సేవ చేయ‌గ‌ల‌న‌ని ప్ర‌క‌టించాడు.

ఆయ‌న‌కు 81 ఏళ్‌లు. కొన్ని స‌మ‌యాల‌లో ఆగి పోతూ మాట్లాడాడు. తిరిగి ఎన్నిక‌ను కోరుకోకూడ‌ద‌నే త‌న అద్భుత‌మైన నిర్ణ‌యాన్ని వివ‌రించినప్పుడు స్వ‌రం కొంత త‌డ‌ప‌డింది. యువ గొంతు’లకు ఇది సమయం అని, దేశాన్ని ఏకం చేసి ప్రజాస్వామ్యాన్ని ‘రక్షిస్తారని’ తాను విశ్వసిస్తున్నాన‌ని చెప్పాడు. ఈ సంద‌ర్బంగా ఉపాధ్య‌క్షురాలిగా ఉన్న క‌మలా హారీస్ ను అధ్య‌క్ష ప‌దవికి సిఫార‌సు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు జోసెఫ్ బైడెన్.

అధ్యక్షుడిగా నా వంతు దేశానికి సేవ చేశాన‌ని చెప్పారు. అమెరికా మ‌రింత బ‌లోపేతం అయ్యేలా చేశాన‌ని స్ప‌ష్టం చేశారు జోసెఫ్ బైడెన్. మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా స‌పోర్ట్ చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మన ప్రజాస్వామ్యాన్ని కాపాడే మార్గంలో ఏదీ, ఏదీ అడ్డు రాకూడదన్నారు. అందులో వ్యక్తిగత ఆశయం కూడా ఉంటుంది, కాబట్టి కొత్త తరానికి జ్యోతిని అందించడమే ఉత్తమ మార్గం అని నేను నిర్ణయించుకున్నాని స్ప‌ష్టం చేశారు.