NEWSTELANGANA

స్వ‌రం మారినా నిజమే మాట్లాడాలి

Share it with your family & friends

స్మితా స‌బ‌ర్వాల్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆమె ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆస‌క్తిక‌రమైన వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఆమె ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ గా మారాయి. ఇందులో భాగంగా విభిన్న ప్ర‌తిభావంతులు (విక‌లాంగులు) ర‌క్ష‌ణ , సివిల్స్ , విమాన‌యాన రంగాల‌లో ప‌ని చేసేందుకు ఎలా అర్హుల‌వుతారంటూ ప్ర‌శ్నించారు.

అంతే కాదు వారు శారీర‌కంగా బ‌ల‌వంతులు కార‌ని, అలా అయిన‌ప్పుడు ఎలా ఒత్తిళ్ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారంటూ నిల‌దీశారు. అందుకే విక‌లాంగుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఎందుకు వ‌ర్తింప చేయాల‌ని నిల‌దీశారు. ప్ర‌తిభ ఆధారంగా ఎలాగూ పోస్టులు పొందే ఛాన్స్ ఉంద‌ని పేర్కొన్నారు.

దీంతో త‌మ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించారు విభిన్న ప్ర‌తిభావంతులు. ప్ర‌ధానంగా విక‌లాంగురాలిగా ఉంటూనే ఏఐఎస్ గా ప‌ని చేసి స్వ‌చ్చంధంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన బాల ల‌త నిప్పులు చెరిగారు. బేష‌ర‌తుగా వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్బంగా ఎక్క‌డా త‌గ్గ‌లేదు స్మితా స‌బ‌ర్వాల్. స్వ‌రం వ‌ణికినా స‌రే నిజ‌మే మాట్లాడాల‌ని పేర్కొన్నారు.