గత పాలనలో గంజాయి జోరు – అనిత
నియంత్రించేందుకు చర్యలు తప్పవు
అమరావతి – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాష్ట్ర శాసన సభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సందర్భంగా స్పందించారు . ఈ సందర్బంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన 5 ఏళ్ల పాలనా కాలంలో రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేశాడని ఆరోపించారు. అందుకే తాము గుర్తించామని, ఎక్కడా కూడా కనిపించకుండా చేయాలని ఆదేశించడం జరిగిందని చెప్పారు వంగలపూడి అనిత.
గంజాయి విస్తరించేందుకు జగన్ రెడ్డి ప్రోత్సహించాడని, అందుకే రాష్ట్రం మొత్తం గంజాయికి కేరాఫ్ గా మారి పోయిందన్నారు. దీనిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడా కూడా ఎవరు ఉన్నా సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు హోం శాఖ మంత్రి .
విచిత్రం ఏమిటంటే గంజాయి దెబ్బకు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రధానంగా చదువుకునే పిల్లలు దీని బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా గంజాయి లభించేలా, జగన్ రెడ్డి ముఠా వ్యాపారం చేసిందన్నారు
గంజాయి తాగి, విచక్షణ లేకుండా, నేరాలకు పాల్పడుతూ, రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వంగలపూడి అనిత. వీళ్ళ స్వార్ధం కోసం, బంగారు భవిష్యత్తు ఉన్న యువత జీవితాలు నాశనం చేశారని ఆరోపించారు. గంజాయి నియంత్రణ అనేది తమ ప్రభుత్వ మొదటి బాధ్యత అని స్పష్టం చేశారు .