టీటీడీ ఏఈవోగా వెంకయ్య చౌదరి
నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ)కి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న జె. శ్యామల రావును నియమించింది. ఆయన స్థానంలో ఉన్న ధర్మా రెడ్డిపై వేటు వేసింది. ఆయనపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ తరుణంలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎంగా కొలువు తీరిన వెంటనే ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అన్నట్టుగానే చర్యలకు ఉపక్రమించారు. పలువురు సీనియర్ ఆఫీసర్లకు స్థాన చలనం కల్పించారు.
ఇదే సమయంలో ఇప్పటి వరకు తిరుమలలో పరిపాలనా పరంగా జె. శ్యామల రావుతో పాటు ఇద్దరు జేఈవోలు ఉన్నారు. ఒకరు గౌతమి కాగా మరొకరు వీర బ్రహ్మం. ఇద్దరూ కీలకంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో మరొకరిని నియమించింది ప్రభుత్వం.
తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో టీటీడీ అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరిని నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళో లేదా రేపో చౌదరి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన తిరుమలలో ఇంకెంత మందిని నియమిస్తుందో వేచి చూడాలి.