NEWSTELANGANA

రూ. 2,91,159 కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్

Share it with your family & friends

ప్ర‌వేశ పెట్టిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్ – రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క గురువారం రాష్ట్ర శాస‌న స‌భ‌లో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా గ‌త ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. ఇదిలా ఉండ‌గా బ‌డ్జెట్ కు సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు చేసిన వారికి, త‌యారులో కీల‌క‌మైన పాత్ర పోషించిన వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

ఇదిలా ఉండ‌గా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు డిప్యూటీ సీఎం. ఇందులో రెవెన్యూ ఖ‌ర్చ‌యు రూ.2,20,945 కోట్లు గా పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లు.. సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు.. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు కేటాయించిన‌ట్లు ప్ర‌క‌టించారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

బ‌డ్జెట్ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు డిప్యూటీ సీఎం. గ‌త ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. వారు చేసిన నిర్వాకం కార‌ణంగా ఇవాళ రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారింద‌న్నారు. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని అన్నారు.

బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారంటూ ఎద్దేవా చేశారు.. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు భ‌ట్టి విక్ర‌మార్క‌. గత పదేళ్లలో ప్రభుత్వ అప్పు పది రెట్లు పెరిగిందన్నారు.. వామనావతారం లెక్క అప్పులు పెరిగాయి త‌ప్పా ఆదాయం వ‌చ్చిన పాపాన పోలేద‌న్నారు.