లా అండ్ ఆర్డర్ పై ఫోకస్ – అనిత
వైసీపీ అబద్దపు ప్రచారం మానుకోవాలి
అమరావతి – ఏపీలో శాంతి భద్రతలు కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఏపీ మంత్రి వంగలపూడి అనిత. గురువారం శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనా కాలంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పక్కదారి పట్టించారని ఆరోపించారు. దోచు కోవడం దాచు కోవడంపైనే ఎక్కవుగా మాజీ సీఎం జగన్ దృష్టి సారించారని మండిపడ్డారు.
ప్రజలకు రక్షణ లేకుండా పోవడం వల్లనే వైసీపీని పక్కకు పెట్టారని, కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు వంగలపూడి అనిత. ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఏపీ హోం శాఖ మంత్రి .
చిల్లర రాజకీయాలు మానుకుంటే బెటర్ అని వైసీపీకి సూచించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన దారుణాలను తమ కూటమి సర్కార్ కు అంటగట్టే ప్రయత్నం చేయడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే ప్రజలు మరోసారి ఛీ కొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఎంత కాలం అబద్దాలు ప్రచారం చేసుకుంటూ పోతారంటూ ప్రశ్నించారు వంగలపూడి అనిత.