చెలరేగిన చన్నీ భగ్గుమన్న బిట్టు
పార్లమెంట్ లో వాడి వేడి చర్చ
ఢిల్లీ – పార్లమెంట్ సమావేశాలలో ఆసక్తికర పరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. సభ్యులు, మంత్రుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఒకానొక సందర్బంలో ఇద్దరూ వ్యక్తిగత దూషణలకు దిగడం కొంత ఆందోళనకు దారి తీసేలా చేసింది.
అధికారంలో ఉన్న బీజేపీ పక్ష నేత బిట్టుపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీ. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ సంకీర్ణ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. దేశాన్ని గతంలో ఏలిన బ్రిటీష్ పాలకులకు ఇవాళ ఏలుతున్న మోడీ పాలనకు తేడా ఏమీ లేదని సంచలన కామెంట్స్ చేశారు చన్నీ.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కేంద్ర మంత్రి బిట్టు. ఏదైనా ఉంటే పాలనా పరంగా వైఫల్యాలను ఎత్తి చూపాలే తప్పా ఇలా వ్యక్తిగతంగా దూషిస్తే ఎలా అని ప్రశ్నించారు. మరి ఏఐసీసీ మాజీ చీఫ్, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాటేమిటి అని ప్రశ్నించారు బిట్టు.
ఈ సందర్బంగా చన్నీ సీరియస్ అయ్యారు. బిట్టును ఉద్దేశించి మీ దివంగత తాత దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుడు అని..కానీ నువ్వు బీజేపీలో చేరాక ఆయన నిజంగా మరణించారంటూ ఫైర్ అయ్యారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బిట్టు.