టి20 లీగ్ లో ద్రవిడ్ కొడుకు
మైసూర్ వారియర్స్ కొనుగోలు
బెంగళూరు – భారత మాజీ క్రికెటర్ , మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ కు బిగ్ ఛాన్స్ దక్కింది. తను క్రికెటర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బ్యాటింగ్ దిగ్గజం తన కొడుక్కి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా మైసూర్ వారియర్స్ మేనేజ్ మెంట్ సవిత్ ద్రవిడ్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం సవిత్ వైరల్ గా మారాడు. రాబోయే మహారాజా సీజన్ కు ముందు ఆటగాళ్ల వేలం కొనసాగింది.
ఈ వేలం పాటలో ద్రవిడ్ తనయుడు సవిత్ కు చోటు దక్కడం విశేషం. దీంతో తను కూడా టి20 లీగ్ కు ఆడేందుకు సిద్దంగా ఉన్నాననంటూ చెప్పకనే చెప్పాడు. సవిత్ ద్రవిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. అంతే కాదు అద్బుతమైన సీమర్ కూడా.
సవిత్ ద్రవిడ్ ను మైసూర్ వారియర్స్ రూ. 50,000లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా సవిత్ ఈ సీజన్ లో ట్రోఫీని గెలుచుకున్న కర్ణాటక అండర్ -19 జట్టులో భాగంగా ఉన్నాడు. అంతే కాదు ఈ ఏడాది ప్రారంభంలో సందర్శించిన లాంక్ షైర్ జట్టుపై కర్ణాటక జట్టు 11 తరపున కూడా ఆడాడు సవిత్ ద్రవిడ్. ప్రసిద్ద్ కృష్ణ కూడా తోడు కావడంతో అతడికి మరింత బలం చేకూరింది.