రాష్ట్రంలో విధ్వంసకర పాలన
నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని ఆరోపించారు.
అసలు రాష్ట్రం ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలని టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తోందని ఆవేదన చెందారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
ఇవాళ వాళ్లు అధికారంలో ఉన్నా రేపటి రోజున తాము కూడా పవర్ లోకి వస్తామన్నది గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. తాము అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు.
కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు జగన్ రెడ్డి. విధ్వంసాలు జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, ఇది మంచిది కాదన్నారు. ప్రశ్నించే వారిని అణిచి వేసే ధోరణితో ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు జగన్ మోహన్ రెడ్డి.