NEWSNATIONAL

త్వ‌ర‌లో ఉప‌గ్ర‌హ ఆధారిత టోల్ వ‌సూలు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ

ఢిల్లీ – కేంద్ర ఉప‌రిత‌ల‌, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం పార్ల‌మెంట్ వేదిక‌గా స‌భ్యులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల‌ను త్వ‌ర‌లో ఎత్తి వేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల కార‌ణంగా స‌మ‌యం వృధా అవుతోంద‌ని, అంతే కాకుండా వంద‌లాది వాహ‌నాల రాక పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంద‌ని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మ‌రింత మెరుగైన టెక్నాల‌జీ ని వాడుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం వ్య‌వ‌స్థ‌ల‌న్నీ శాటిలైట్ ల‌తో అనుసంధానమై ఉన్నాయ‌న్న విష‌యం గుర్తు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. ఇందులో భాగంగా ఇక నుంచి టోల్ గేట్ వ్య‌వ‌స్థ‌ను ఎత్తి వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

అయితే టోల్ గేట్ల స్థానంలో కొత్త విధానాన్ని తీసుకు వ‌స్తామ‌ని చెప్పారు. కొత్త‌గా ఉప‌గ్ర‌హ ఆధార‌త టోల్ వ‌సూలు విధానాన్ని ప్ర‌వేశ పెడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు నితిన్ గ‌డ్క‌రీ. కిలోమీట‌ర్ ప్ర‌కారం కొత్త పద్ద‌తి ద్వారా ప‌న్ను ఆటో మేటిక్ గా తీసుకుంటామ‌న్నారు. ఇది రెండు నెల‌ల్లో అమ‌లు కావ‌చ్చ‌ని తెలిపారు.