తగ్గిన ఆదాయం ఏపీపై పెను భారం
ఏపీ సీఎం శ్వేత పత్రం విడుదల
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. శుక్రవారం శాసన సభ వేదికగా ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 10 లక్షల కోట్ల దాకా అప్పులు ఉన్నాయంటూ ప్రకటించారు. మొత్తంగా గతంలో ఏలిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. దీనిని పూడ్చాలంటే మరికొన్ని కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
తాము ప్రకటించిన హామీలకు సంబంధించి ఎక్కడా ఆలస్యం చేయకుండా అమలు చేసి తీరుతామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు తాము రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని తెలిపారు.
కానీ ఆ తర్వాత ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పాలసీ మార్చి తమకు కావాలసిన వారికి అప్పగించాడని ఆరోపించారు సీఎం. ఇప్పుడు ఇవి చాలా ఆలస్యం అయ్యాయని తెలిపారు. రాష్ట్రానికి రూ.76,795 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. అమరావతి అభివృద్ధి కొనసాగి ఉంటే 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అంతే కాకుండా రూ. 3 లక్షల కోట్ల ఆస్తి వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.