మెరిసిన స్మృతీ మంధాన
ఫైనల్ కు చేరిన టీమిండియా
ఆసియా కప్ – హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ -2024 ఫైనల్ కు చేరింది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్థి బంగ్లా దేశ్ మహిళా జట్టును 10 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా దేశ్ టీం ఏ కోశాన ప్రతిఘటించ లేక పోయింది. భారత మహిళా బౌలర్లు దుమ్ము రేపారు. కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులకే పరిమితం అయ్యింది.
అనంతరం 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది భారత మహిళా జట్టు. షెఫాలీ వర్మ, స్మృతీ మంధాన అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు. మరో వికెట్ కోల్పోకుండానే పని కానిచ్చేశారు. స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన కేవలం 38 బంతులు మాత్రమే ఎదుర్కొని 50 రన్స్ చేసింది . అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది స్మృతీ మంధాన.
మరో వైపు షఫాలీ వర్మ సైతం సూపర్ సపోర్ట్ ఇచ్చింది. ఈ సందర్బంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జె షా మహిళా జట్టును ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సమయంలో స్మృతీ ఆడిన తీరు అద్భుతం అంటూ కొనియాడారు.