ఒలింపిక్స్ లో రెప రెప లాడిన జెండా
ముందు నడిచిన పీవీ సింధు
పారిస్ – ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఒలింపిక్స్ 2024 పోటీలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో. అక్కడి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. చెదురు మదురు సంఘటనలు మినహా గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. గతంలో కంటే ఈసారి ఎక్కువగా అథ్లెట్లు హాజరయ్యారు ఆయా దేశాల తరపున.
ఇక భారత దేశానికి సంబంధించిన అథ్లెట్లు ఉత్సాహంతో పాల్గొన్నారు. మన దేశం తరపున ప్రముఖ క్రీడాకారిణి తెలుగు వారి బిడ్డ పీవీ సింధు క్రీడాకారుల అందరి తరపున భారత దేశం తరపున మువ్వొన్నెల జాతీయ పతాకాన్ని ధరించే అవకాశం దక్కించుకుంది.
ఆమె జెండాను పట్టుకుని ముందుకు నడవగా వెనుక అథ్లెట్లు నడిచారు. ఈ సందర్బంగా భారత దేశానికి చెందిన జాతీయ గీతం జనగణమణ అధినాయక జయేహేను ఆలాపించారు. క్రీడాకారులంతా శిరస్సు వంచి వందనం సమర్పించారు.
143 కోట్ల మంది భారతీయుల కలలు నిజం చేయాలని, క్రీడాకారులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలని, జాతి గర్వ పడేలా చేయాలని ఆశిద్దాం. ఇదిలా ఉండగా తనకు జెండాను స్వీకరించే భాగ్యాన్ని కల్పించినందుకు భారత దేశ ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు పీవీ సింధు.