చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలి
స్పష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేతి వృత్తులతో పాటు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు . ప్రభుత్వ పరంగా కీలకమైన శాఖలు విధిగా వీరు తయారు చేసిన ఉత్పత్తులను తీసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు సీఎం.
ప్రధానంగా పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య శాఖ, తదితర శాఖలు క్లాత్ ను సేకరించేలా చర్యలు చేపట్టాలని అన్నారు రేవంత్ రెడ్డి. హ్యాండ్లూమ్, పవర్లూమ్లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. మహిళా శక్తి గ్రూపు సభ్యులకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ పై చేపడుతున్న కార్యక్రమాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.