NEWSANDHRA PRADESH

జ‌లాశ‌యాలు నిండు కుండ‌లు

Share it with your family & friends

గోదావరి..తుంగ‌భ‌ద్ర‌..శ్రీ‌శైలం
అమ‌రావ‌తి – భారీ ఎత్తున కురుస్తున్న వ‌ర్షాల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండ‌ల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. ఈ మేర‌కు శ‌నివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గోదావ‌రి వ‌ర‌ద ఉధృతి అంత‌కంత‌కూ పెరుగుతోంది.

భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 50.9 అడుగులు ఉంద‌ని పేర్కొంది . ఇక ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.49 లక్షల క్యూసెక్కులు ఉంద‌ని, దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించింది.

శ్రీశైలం జలాశయానికి భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింద‌ని, ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 863.40 అడుగులకు చేరుకుంది.

కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్ప‌త్తి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 52,199 క్యూసెక్కులు ఉండ‌గా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండ‌గా ప్రస్తుత నీటి మట్టం 506.60 అడుగులకు చేరుకుంది.

ఇక తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండ‌గా ప్రస్తుత నీటి మట్టం 1631.68 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 1,03,676 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,17,571 క్యూ సెక్కులు ఉంది.

ఇదిలా ఉండ‌గా విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న‌ట్లు డైరెక్ట‌ర్ రోణంకి కూర్మ‌నాథ్ తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 1070,112,18004250101 నెంబర్లను సంప్రదించాల‌ని కోరారు.