NEWSTELANGANA

స్త్రీ స్వ‌రం ఆకాంక్ష‌ల స‌మ్మేళ‌నం

Share it with your family & friends

కితాబు ఇచ్చిన స్మితా స‌బ‌ర్వాల్

హైద‌రాబాద్ – మ‌హిళ‌లు త‌లుచుకుంటే ఏమైనా సాధించ‌గ‌ల‌రు. ప్ర‌త్యేకించి క‌ళా రూపాలు రూపొందించ‌డంలో, త‌యారు చేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారు. వారిని గుర్తించి తోడ్పాటు అందిస్తే అద్బుతాలు సృష్టించే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్.

ప్ర‌ముఖ చిత్ర‌కారిణి చైతాలి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని స్టేట్ గ్యాల‌రీ ఆఫ్ ఆర్ట్ లో ఏర్పాటు చేసిన చిత్ర క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆమె సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆర్టిస్ట్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. క‌ళ అనేది భిన్న‌మైన‌ద‌ని, దానిని పొందాలంటే ఎంతో కొంత పుణ్యం చేసుకుని ఉండాల‌ని పేర్కొన్నారు ఈ సంద‌ర్బంగా స్మితా స‌బ‌ర్వాల్.

డివైన్ ఆరా – ఇన్న‌ర్ వాయిస్ అనే థీమ్ తో రూపొందించిన పెయింటింగ్ ల‌ను ఏర్పాటు చేశారు. వాటిని ప‌రిశీలించారు స్మితా స‌బ‌ర్వాల్. ప‌రిణామం చెందుతున్న స్త్రీ స్వ‌రం ..ఈ చిత్రాల ఆకాంక్ష‌ల స‌మ్మేళ‌నం అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఎవ‌రైనా క‌ళాభిమానులు త‌మ‌కు పెయింటింగ్స్ కావాల‌ని అనుకుంటే : +91 85209 47530 ఈ నెంబ‌ర్ లో చైతాలిని సంద‌ర్శించాల‌ని సూచించారు స్మితా స‌బ‌ర్వాల్.