ప్రపంచంలో కరాచీ ప్రమాదకర నగరం
ప్రకటించిన అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్
అమెరికా – ఉగ్రవాదులకు ఊతం ఇస్తూ ఉగ్రవాదానికి కేరాఫ్ గా మారిన పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు శనివారం అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ సంచలన ప్రకటన చేసింది. ప్రపంచంలో అత్యంత చెత్త, ప్రమాదకరమైన నగరంగా పాకిస్తాన్ దేశ రాజధాని కరాచీ నగరాన్ని పేర్కొంది. పర్యాటకులు ఎవరైనా సరే దీనిని గమనించి , గుర్తించి వెళ్లక పోవడమే మంచిదని సూచించింది.
పర్యాటకులకు సురక్షితమైన నగరం కాదని స్పష్టం చేసింది. ఎవరైనా తమ సూచనలు కాదని వెళ్లినా తాము పట్టించు కోమని హెచ్చరించింది. ఇప్పటికే ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్లయింది అమెరికా తాజాగా చేసిన హెచ్చరిక.
ఓ వైపు ఆఫ్గనిస్తాన్ లో ఉగ్రవాదానికి ఊతమిచ్చి తన కంట్రోల్ లోకి తీసుకోవాలని ప్లాన్ చేసింది. దానికి తెలివిగా చెక్ పెట్టింది ఇండియా. ఇప్పుడు ఆఫ్గాన్ కు అత్యంత ఆప్తమిత్ర దేశంగా భారత్ ఉండడం విశేషం. ఇదే సమయంలో భారత్ లో ముచ్చటగా మూడోసారి మోడీ పీఎంగా కొలువు తీరడంతో ఇక్కడ పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉండేలా చేశారు.
ఈ తరుణంలో అమెరికా స్టేట్ శాఖ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్ కు తీవ్ర ఇబ్బందులు కలిగించనుంది.