సంజూ శాంసన్ కు ఛాన్స్ కష్టమే
గౌతమ్ గంభీర్ వచ్చినా నో ఛేంజెస్
శ్రీలంక – కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ శ్రీలంక టూర్ లో ఉన్నప్పటికీ టి20 సీరీస్ లో ఆడే ఛాన్స్ రాక పోవచ్చని అంచనా. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నా తనకు న్యాయం చేయలేక పోయాడు. ఇక రిషబ్ పంత్ ఉండడంతో మనోడికి ఇబ్బందిగా మారింది.
తాజాగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసినా చివరకు గౌతం గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్నప్పటికీ సంజూ శాంసన్ ను ఆడించక పోవచ్చని ప్రచారం జరుగుతోంది. ముంబై లాబీయింగ్ ఇప్పుడు ఎంపికలో ఎక్కువగా ప్రభావితం చేస్తోందన్న విమర్శలు లేక పోలేదు.
ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. జైస్వాల్ , గిల్ లు ఓపెనింగ్ చేస్తారు. పంత్ , సూర్య కుమార్ యాదవ్ మూడు లేదా నాలుగో స్థానంలో రానున్నారు. పంత్ ఒక వేళ ఓకే అయితే సంజూ శాంసన్ ను స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయిస్తే తప్ప అతనికి జట్టులో స్థానం లభించక పోవచ్చని అంచనా.
ఇక శివమ్ దూబే నుంచి పోటీ ఉన్నా పాండ్యా 5వ స్థానంలో రానున్నాడు. రింకూ సింగ్ 6వ స్థానంలో రానున్నాడు. సుందర్, పటేల్ స్పిన్నర్లు. రవి బిష్ణోయ్ మూడో బౌలర్ గా వాడుకోనున్నారు.