వరద బాధితులకు మంత్రుల భరోసా
ఆర్థిక సాయం..నిత్యావసర సరుకులు పంపిణీ
ఏలూరు జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు కళ కళ లాడుతున్నాయి. భారీ ఎత్తున వరద ఉధృతి రావడంతో గోదావరి, శ్రీశైలం, భద్రాచలం, తుంగభద్ర నీళ్లతో నిండు కుండలా మారాయి.
ఇదిలా ఉండగా వర్షాల తాకిడికి భారీ ఎత్తున పంటలు కోల్పోయారు రైతులు. మరో వైపు ప్రజలు చాలా చోట్ల నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం సహాయక చర్యలపై ఫోకస్ పెట్టింది. శాసనసభ సాక్షిగా బాధితులకు అండగా నిలవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఏపీకి చెందిన మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడు, పార్థ సారథి, వంగలపూడి అనిత శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం, కన్నయ్యగుట్ట గ్రామాలలో వరద బాధితులను పరామర్శించారు.
బాధితులకు భరోసా కల్పించారు. కొందరికి ఆర్థిక సాయం చేశారు. మరికొందరికి నిత్యా వసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సంరద్బంగా మంత్రులు మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.