ప్రతిపక్ష హోదా పేరుతో జగన్ నాటకం
పారి పోయేందుకే మాజీ సీఎం ప్లాన్
అమరావతి – ఏపీ మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రతిపక్ష హోదా పేరుతో కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు. శనివారం యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు.
సభలో 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని, ఆ విషయం జగన్ రెడ్డికి తెలిసినా సమస్యలను తప్పు దోవ పట్టించేందుకు ఆడుతున్న నాటకం తప్ప మరోటి కాదన్నారు. ఇది ఆయనకు తగదన్నారు యనమల రామకృష్ణుడు.
గతంలో దివంగత ఉపేంద్ర, పీజేఆర్‌లకు గ్రూప్ ఆఫ్ లీడర్ ఇస్తే దానిని లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా జగన్ మోహన్ రెడ్డిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు మాజీ స్పీకర్. ప్రతిపక్ష హోదా ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో దక్కదని స్పష్టం చేశారు.
అయితే జగన్ రెడ్డి వైసీపీ నాయకుడిగా శాసన సభలో తన గొంతు వినిపించ వచ్చని, దీనికి ఎలాంటి అభ్యంతరాలు అంటూ ఉండవని అన్నారు. మొత్తంగా జగన్ రెడ్డి ఎలాగైనా సరే ఏపీ నుంచి పారి పోవాలని ప్లాన్ చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు యనమల రామకృష్ణుడు.