రిషబ్ పంత్ ఫస్ట్ ప్రయారిటీ
కేఎల్ రాహు్..శాంసన్ కు షాక్
న్యూఢిల్లీ – టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అన్ని ఫార్మాట్ లకు వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కచ్చితంగా ఉంటాడని, ఇందులో వేరే ఆటగాడిని ఎంపిక చేయాలని అనుకోవడం లేదంటూ బాంబు పేల్చాడు.
గత కొంత కాలంగా కేరళ క్రికెట్ స్టార్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంపన్ తో పాటు కేఎల్ రాహుల్ సైతం జట్టులో స్థానం కోసం నానా తంటాలు పడుతున్నారు. గంభీర్ వచ్చాక సీన్ మారుతుందని అంతా భావించారు. పెద్ద ఎత్తున శాంసన్ కు చోటు దక్కాలని సామాజిక మాధ్యమాల వేదికగా క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్ కోరారు.
వాటన్నింటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు హెడ్ కోచ్. వికెట్ కీపర్ గా ఎవరు ఉండాలనేది బయటి వాళ్లు నిర్ణయించరని పేర్కొన్నారు. ఇతర ఆటగాళ్ల గురించి ఎవరికి తోచిన విధంగా వారు కోరుకుంటే ఇక హెడ్ కోచ్ ఉండేది ఎందుకోసమని ఎదురు ప్రశ్న వేశాడు గౌతమ్ గంభీర్.
కాగా వేరే వాళ్ల అభిప్రాయాలను, సూచనలను పట్టించుకునే ఓపిక, తీరిక తనకు లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు .