పాలమూరు బిడ్డా నిను మరువదు ఈ గడ్డ
సూదిని జైపాల్ రెడ్డికి సీఎం నివాళులు
హైదరాబాద్ – ఉత్తమ పార్లమెంటేరియన్ గా దేశ రాజకీయాలలో పాలమూరుకు పేరు తీసుకు వచ్చిన అరుదైన నాయకుడు , అజాత శత్రువు సూదిని జైపాల్ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. జూలై 28న జైపాల్ రెడ్డి వర్దంతి సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
తనకు దగ్గరి బంధుత్వం ఉన్నప్పటికీ సూదిని జైపాల్ రెడ్డి నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఏకైక నాయకుడు అని ప్రశంసించారు. పాలమూరు గడ్డ మీద పుట్టిన జైపాల్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.
సూర్య చంద్రులు ఉన్నంత కాలం జైపాల్ రెడ్డి జీవించి ఉంటారని అన్నారు రేవంత్ రెడ్డి. రాజకీయాలలోకి రావాలని అనుకునే వారికి ఆయన జీవితం పాఠంగా ఉపయోగ పడుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి నాయకుడు మళ్లీ జన్మిస్తాడని తాను అనుకోవడం లేదన్నారు.
రాజకీయాలలో రాజీ పడని మనస్తత్వం, విలువలకు కట్టుబడి ఉన్న అరుదైన నేతగా తను జీవిత కాలమంతా బతికాడని , జైపాల్ రెడ్డి లేని లోటు పూడ్చ లేనిదని పేర్కొన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.