పథకాలపై జగన్ పేరు తొలగిస్తాం
ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం
అమరావతి – ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాల పేర్లను మార్చుతున్నట్లు వెల్లడించారు.
నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ట్రాన్ని ఏలిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని, అన్ని రంగాలను నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. ప్రధానంగా విద్యా, ఆరోగ్య రంగాలను పట్టించు కోలేదని వాపోయారు.
ఇదే సమయంలో ప్రతి పథకానికి తన పేరు పెట్టుకున్నాడని, కేవలం తన ప్రచారం కోసం తన స్వంత మీడియాకు రూ. 400 కోట్లకు పైగా ప్రకటనల రూపంలో దోచి పెట్టాడని నిప్పులు చెరిగారు. దీనిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు నారా లోకేష్.
ఇదిలా ఉండగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలకు జగన్ పేరు తీసి వేస్తున్నామని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే కలాం, డొక్కా సీతమ్మ లాంటి స్పూర్తి దాయకమైన వ్యక్తులను, మహనీయుల పేర్లు పెడతామని ప్రకటించారు.