కేటీఆర్ కామెంట్స్ ఉత్తమ్ సీరియస్
గోబెల్ ప్రచారం ఆపితే మంచిది
హైదరాబాద్ – పదే పదే తమ సర్కార్ పై అవాకులు చెవాకులు పేలడం కేటీఆర్ మానుకుంటే మంచిదని హితవు పలికారు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్లుగా పాలించిన బీఆర్ఎస్ సర్కార్ ఎలా మోసం చేసిందో, అవినీతి అక్రమాలకు పాల్పడిందో ప్రజలందరికీ తెలుసని, మరోసారి చెప్పాల్సిన పని లేదన్నారు.
నీటి పారుదల శాఖపై కొంత స్పష్టత వచ్చిందని అన్నారు. లోన్స్, జీతాలు ఇతర ఖర్చులు పోను 10,820 కోట్లు పనుల కోసం ఉన్నాయని చెప్పారు. పెండింగ్ పనులు, మైనర్, మేజర్ పనుల పై సమీక్ష చేశామన్నారు. ఇక నుంచి ఒక కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నామన్నారు ఉత్తమ్.
ఇప్పటి నుంచి ఆరున్నర లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. రాబోయే ఏడాది పాటు టార్గెట్ పెట్టుకోని ఇరిగేషన్ పనులను చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి ఇరిగేషన్ పై సమీక్ష చేస్తానని అన్నారు..వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
కేటీఆర్ కాళేశ్వరం పై భాధ్యతా రహితమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జోసెఫ్ గోబెల్స్ కి మించి అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నీళ్లు ఎత్తి పోయాలని అంటున్నారని, ఎక్కడి నుంచి లిఫ్ట్ చేయాలో చెబితే బాగుంటుందన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బ్యారేజీలు డ్యామేజ్ లలో నీళ్లు ఆపితే ప్రమాదం జరిగితే ఎవరు భాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. భద్రాచలం రాముడి గుడి కూడా మునిగి పోతుందని హెచ్చరించారు.ప్రపంచంలో ఎక్కడైనా మూడు, నాలుగు టిఎంసి ల కంటే ఎక్కువ స్టోరేజ్ కలిగిన బ్యారేజీలు లేవన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.