మను..దేశం నిన్ను చూసి గర్విస్తోంది
షూటర్ మను భాకర్ కు ప్రశంస
ఢిల్లీ – ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న ప్రపంచ ఒలింపిక్స్ 2024 గేమ్స్ లో భారత దేశం తరపున బోణీ కొట్టింది ప్రముఖ షూటర్ మను భాకర్. షూటింగ్ విభాగంలో ఇవాళ జరిగిన పోటీల్లో అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కాంస్య పతకాన్ని సాధించింది. తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయింది.
దేశం తరపున తొలి పతకం కావడం విశేషం. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా అభినందనలతో ముంచెత్తారు. ఆమె సాధించిన ఈ విజయం, ఈ కాంస్య పతకం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
ఇవాళ చరిత్రాత్మకమైన రోజుగా మోడీ అభివర్ణించారు. మను భాకర్ లాంటి యువత ఈ దేశానికి కావాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తోందని తెలిపారు. దేశం తరపున తొలి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించినందుకు మను భాకర్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.