గురి తప్పని షూటర్ మను భాకర్
ఆత్మ విశ్వాసం ఆమె ఆయుధం
హైదరాబాద్ – యావత్ భారత దేశమంతా ఎవరీ మను భాకర్ అని విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. మన దేశం తరపున షూటింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది హర్యానాకు చెందిన మను భాకర్. తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయింది. తొలి మహిళా అథ్లెట్ గా రికార్డ్ సృష్టించింది.
మను భాకర్ కెరీర్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవార్డులు, పతకాలకు లెక్కే లేదు. ఆమె వయసు 22 ఏళ్లు. ఫిబ్రవరి 18, 2002లో హర్యానా రాష్ట్రం ఝుజ్జర్ జిల్లా గోరియా లో పుట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీ విభాగంలో సత్తా చాటింది మను భాకర్. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.
2023లో జరిగిన పోటీల్లో తొలి స్థానం సాధించింది మను భాకర్. 2022లో కైరోలో జరిగిన పోటీల్లో 2వ స్థానంలో నిలిచింది. రజత పతకాన్ని సాధించింది. 2019లో చైనాలో జరిగిన పోటీల్లో తొలి స్థానం పొందింది. బంగారు పతకాన్ని పొందింది. ఇదే ఏడాదిలో మిక్స్ డ్ పోటీలలో కూడా స్వర్ణం సాధించింది మను భాకర్.
2018లో గ్వాడలాజారాలో జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. మిశ్రమ జట్టులో కూడా గోల్డ్ మెడల్ సాధించింది . 2019లో మ్యూనిచ్ లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది. రియో డి జనరీలో జరిగిన మిక్స్ డ్ టీమ్ పోటీల్లో స్వర్ణం సాధించింది. 2021లో ఢిల్లీలో జరిగిన పోటీల్లో రజత పతకం పొందింది మను భాకర్. 2019లో దోహాలో జరిగిన ఆసియా కప్ పోటీల్లో సత్తా చాటింది. బంగారు పతకాన్ని సాధించింది.
ఇలా చెప్పుకుంటూ వందల పతకాలు ఆమె కెరీర్ లో సాధించడం విశేషం. మొత్తంగా తను తొలి పతకాన్ని భారత్ కు అందించినందుకు మను భాకర్ ను అభినందించి తీరాల్సిందే.