ఏసీబీకి చిక్కిన యాదాద్రి ఎస్ఈ రామారావు

20 శాతం క‌మీష‌న్ తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : అవినీతి నిరోధ‌క శాఖ వ‌ల‌లో చిక్కాడు దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ‌కు చెందిన ఇంఛార్జ్ ఎస్ఈ రామారావు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ SE గా బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ . మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు ఇప్పించడానికి 20% కమిషన్ డిమాండ్ చేశాడు. ఇద్దరి మధ్యలో ఒక లక్ష 90 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ ఏసీబీ వాళ్ళని కలవడంతో నిఘా పెట్టారు నల్గొండ ఏసీబీ అధికారులు . రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం 1,90,000 ఇస్తుండగా పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్ గా.

రామారావు కు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. త‌న‌కుహైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఉన్న ఇంటిపై కూడా రెండు టీములుగా ఏర్ప‌డి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. సోదాలు, త‌నిఖీలు పూర్తి అయ్యాక అన్నీ తెలిసే ఛాన్స్ ఉంద‌న్నారు ఏసీబీ డీఎస్పీ. ఇదిలా ఉండ‌గా ప‌ట్టుబ‌డిన ఎస్ఈ రామారావును జ్యూడిషల్ రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నలగొండ జిల్లా ప్రజలకు ఏదైనా స‌మాచారం వెంట‌నే త‌మ‌కు తెలియ చేయాల‌ని కోరారు డీఎస్పీ.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *