ఇస్కాన్ సహకారంతో పౌష్టికాహారం
సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ విధానం
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తనదైన శైలిలో ఆయన ప్రధాన శాఖలపై ఫోకస్ పెట్టారు. నైపుణ్యాభివృద్ది అనేది కీలకం కావాలని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు.
ఇదే సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న, తనకు రాజకీయంగా మరో జీవితాన్ని ఇచ్చిన సదరు నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలని ఆయన సంకల్పించారు. సీఎంగా అత్యధిక నిధులను కోడంగల్ కు కేటాయించారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ పాఠశాల విధానాన్ని తీసుకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు కోసం కోడంగల్ ను ఎంపిక చేశారు. ఆదివారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు.
సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతి రోజు 28 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని సంకల్పించారు. ఇందుకు సంబంధించి సీఎం సమీక్ష చేపట్టారు.