గత ప్రభుత్వం కుంభకోణాల మయం
నిప్పులు చెరిగిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – శాసన సభా వేదికగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. విద్యుత్ సమస్యపై స్పందించారు. విద్యుత్ కమిషన్ కు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశించినా ఎందుకని చైర్మన్ ను నియమించలేదని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.
ఏం ముఖం పెట్టుకుని చైర్మన్ ను నియమించలేదంటూ అడుగుతారంటూ ప్రశ్నించారు. అలా అడిగే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు. మీ హయాంలో జరిగినదంతా స్కామ్ లు తప్పా ఏముంది చెప్పుకోవడానికి అంటూ మండిపడ్డారు.
ఈ సందర్బంగా ఎక్కడెక్కడ ఎంత బుక్కారో , చేతులు డబ్బులు మారాయో తాను అంకెలతో సహా చెప్పేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి. జార్ఖండ్ లో 2400 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ పనులను బీహెచ్ ఈఎల్ 18 శాతం తక్కువకు కోట్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణలో 4000 మెగావాట్ల యాదాద్రి ప్లాంట్ ను రూ.40 వేల కోట్లకు నామినేషన్ పై ఇచ్చారని , అదే తక్కువకు ఇచ్చేందుకు ఛాన్స్ ఉన్నా ఎందుకని టెండర్లు పిలువ లేదని మండిపడ్డారు. ఇందులో దాదాపు రూ. 8 వేల కోట్ల కుంభకోణం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.