రేపే రెండో విడత రైతు రుణ మాఫీ
7 లక్షల మంది రైతులకు ప్రయోజనం
హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సోమవారం అసెంబ్లీ సాక్షిగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాము ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా నిన్న కల్వకుర్తి వేదికగా జరిగిన బహిరంగ సభలో రైతులందరికీ రుణ మాఫీ పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు సీఎం. ఇదిలా ఉండగా రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం వేదికగా జూలై 30న రైతు రుణాలను మాఫీ చేయనుంది రాష్ట్ర సర్కార్.
రైతు రుణ మాఫీ కింద రాష్ట్రంలో రెండో విడత కింద దాదాపు 7 లక్షల మందికి పైగా రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. వారి ఖాతాల్లో దాదాపు లక్షన్నర రూపాయల దాకా జమ చేయనున్నట్లు వెల్లడించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా దాదాపు రూ. 7,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తొలి విడతలో ఏడున్నర లక్షల మంది రైతులకు రూ. లక్ష రుణ మాఫీ చేసినట్లు తెలిపారు సీఎం. ఇక ఆగస్టు నెలాఖరు లోపు రూ. 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని కల్వకుర్తి సభలో ప్రకటించారు.